జహీరాబాద్ బీజీపీ అభ్యర్థిగా హిందుత్వవాది?

దేశంలో, రాష్ట్రంలో పార్లమెంట్లు ఎన్నికల సందడి మొదలైంది. అన్ని సీట్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. చాలా మంది నేతలు ఎంపీలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు..ముఖ్యంగా ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్న జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బరిలో నిలిచేందుకు చాలా మంది నేతలు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఆధ్యాత్మిక వేత్తగా..జర్నలిస్టుగా ..రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా చిరపరిచతులైన కరణ్ రెడ్డికి అవకాశాలు అధికంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. గత రెండు దశాబ్దాలుగా బీజేపీ పార్టీతో ఆయనది ప్రత్యేక అనుబంధం.. పార్టీలో క్రియాశీల పాత్ర పోషించే కరణ్ రెడ్డి.. హిందుత్వ వాది అన్న సంగతి తెలిసిందే..

శారదాపీఠం స్వరూపానందేద్ర సరస్వతి స్వామి వారికి.. స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచార యాత్ర కోఆర్డినేటర్ గా 7500 కిలో మీటర్లు నడిచారు.. వెయ్యికి పైగా ఆలయాల్ని సందర్శించారు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వీరాభిమాని. అనేక మీడియా సంస్థల్లో పని చేసిన కరణ్ రాజకీయ వ్యూహకర్తగానూ ఎంతో మంది నాయకులను ఎమ్మెల్యేలుగా..ఎంపీలుగా గెలిపించారు.. తెలంగాణలో పదేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీకి..ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ కి సైతం పార్టీ స్థాయిలోనూ వ్యూహరచనలో పాలు పంచుకున్నారు..

ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ పడుతున్నట్లు సమాచారం.. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.. జర్నలిస్టుగా.. ఆధ్యాత్మిక వేత్తగా ..ప్రజా సేవకుడిగా రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితులైన కరణ్ ను త్వరలో ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టేలానే ఉన్నారు.