Sound party review: క్లీన్ కామెడీ తో ఫన్ రైడ్..

టైటిల్: సౌండ్ పార్టీ

నటీ నటులు: వీజే సన్నీ, శివన్నారాయణ, ఆలీ, సప్తగిరి, చలాకీ చంటీ, 30 Years పృథ్వీ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, రేఖ పర్వతాల తదితరులు
రచన, డైరెక్టర్: సంజయ్ శేరి
నిర్మాతలు: రవి పొలిశెట్టి, మహేంద్ర గజేందర్, శ్రీ శ్యామ్ గజేంద్ర
సమర్పణ, షో రన్నర్: పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్
మ్యూజిక్: మోహిత్ రెహమానిక్
సినిమాటోగ్రఫి: శ్రీనివాస్ రెడ్డి
ఎడిటర్: జీ అవినాష్
రిలీజ్ డేట్: 2023-11-24

స్టోరీ

మధ్య తరగతి కుటుంబానికి చెందిన డాలర్‌ కుమార్‌(వీజే సన్నీ) ఆయన తండ్రి కుబేర్‌ కుమార్‌(శివన్నారాయణ).. ‍కష్టపడి పని చేయకుండా ధనవంతులు కావాలనుకుంటారు. ఈజీ మనీ కోసం రకరకాల బిజినెస్‌లు చేసి నష్టపోతుంటారు. చివరకు డబ్బుకోసం ఎమ్మెల్యే కుమారుడు చేసిన నేరం తమపై వేసుకొని జైలుకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఎమ్మెల్యే కుమారుడు చేసిన నేరమేంటి? డబ్బు కోసం జైలుకు వెళ్లిన తండ్రికొడుకులు ఎలా బయటపడ్డారు. క్రిప్టో కరెన్సీ పేరుతో ఎలా మోస పోయారు. చివరకు ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ

విశ్లేషణ
జాతి రత్నాలు తర్వాత చాలా కామెడీ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వాటి కొంతవరకు మాత్రమే అన్ని రకాల ప్రేక్షకులు చూసేలా ఉన్నాయి. కొన్ని చిత్రాలు వల్గర్‌ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి వల్గారిటీ లేకుండా..కంప్లీట్‌గా నవ్వించిన చిత్రం సౌండ్‌ పార్టీ. లాజిక్కులను పక్కకి పెట్టి..కేవలం కామెడీని నమ్ముకొనే ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు. తండ్రి, కొడుకుల బాండింగ్ బ్యాక్ డ్రాప్‌తో ఫన్, ఎమోషన్స్‌, రొమాన్స్ అంశాలను కలిపి దర్శకుడు సంజయ్ శేరి రాసుకొన్న కథ, దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగుంది.

సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఫస్టాఫ్‌ కొంత స్లోగా, రొటీన్‌గా సాగినప్పటికీ.. సెకండాఫ్‌ను గ్రిప్పింగ్‌గా, ఎంగేజ్‌ నడిపించిన విధానంతో మూవీ ఫీల్‌గుడ్‌గా మారిందనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే RRR స్పూఫ్ సినిమాకే హైలట్. ఈ సినిమాకి మరో ప్రధాన బలం సంగీతం. మోహిత్ అందించిన పాటలు..బీజియం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.

నటీనటులు

కుబేర్‌ కుమార్‌ పాత్రలో శివన్నారాయణ, డాలర్‌ కుమార్‌ పాత్రలో సన్నీ అదరగొట్టారు. యాక్టింగ్‌ పరంగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. సినిమాని ఫన్‌ రైడ్‌గా నడిపించారు. సిరి పాత్రలో హృతిక ఫర్వాలేదనిపించింది. కానీ లవ్‌ స్టోరీకి పెద్దగా ప్రయారిటీ లేదు. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ కంటే తండ్రీ కొడుకుల కెమిస్ట్రీనే బాగుంది. ఎమ్మెల్యేగా పృథ్వీ మెప్పించాడు. సైంటిస్ట్ గా అలీ కాసేపు మెరిశాడు. అప్పు ఇచ్చే సేటు పాత్రలో నాగిరెడ్డి బాగా నవ్వించాడు. ఆయన తర్వాత చలాకీ చంటి నవ్వులు పూయించాడు. ఇక జైల్లో జైలర్‌గా సప్తగిరి రచ్చ చేశాడు. తన ఎపిసోడ్‌ కూడా సినిమాకి ప్లస్‌ అయ్యింది. సన్నీ మదర్‌గా ప్రియా ఆకట్టుకుంది. ఆమెకి మంచి పాత్ర పడింది. చిత్ర దర్శకుడి పాత్ర కూడా నవ్వించేలా ఉంది. మిగిలిన పాత్రలు సైతం ఓకే అనిపించాయి.

చివరిగా: సౌండ్ పార్టీకి ఓటు వేస్తే..నవ్వులు గ్యారెంటి

రేటింగ్: 3/5