బిగ్‌బాస్‌ 7: మూడోవారం ఆమె ఔట్‌.. బిగ్‌ చరిత్రలో తొలిసారి ఇలా..

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో 7 సీజన్‌ చప్పగా సాగుతోంది. ఉల్టా పుల్టా అంటూ వచ్చిన ఈ షో.. గత సీజన్ల మాదిరే రొటీన్‌గా సాగుతుంది. మూడు వారాలు పూర్తి కావొస్తున్న ఇంకా షో ఆసక్తికరంగా మారలేదు. ఇప్పటికే హౌస్‌లోకి వచ్చిన 14 మందిలో ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యారు. మొదటి వారం కిరణ్‌ రాథోడ్‌, రెండోవారం షకీలా హౌస్‌ నుంచి వెళ్లిపోయింది. ఇక మూడోవారం కూడా ఓ మహిళనే హౌస్‌ నుంచి వెళ్లిపోవడం గమనార్హం

ఆమె ఔట్‌
మూడో వారంలో నామినేషన్‌లో శుభశ్రీ, ప్రిన్స్‌ యావర్‌,అమర్‌ దీప్‌, గౌతమ్‌ కృష్ణ, ప్రియాంక జైన్‌, దామిని, రతిక ఉన్నారు. ఈ 7 మందిలో నుంచి ఊహించిన వ్యక్తి ఎలిమినేట్‌ అయ్యారు. సింగర్‌ దామిని హౌస్‌ నుంచి వెళ్లిపోయింది. బిగ్‌బాస్‌ గత ఆరు సీజన్లలోనూ సింగర్స్‌ పాల్గాన్నారు. వాళ్లలో రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలవగా.. గీతా మాధురి టాప్‌ 5 వరకు వచ్చారు. మిగతవాళ్లు కూడా కనీసం 5 వారాలకు పైనే ఉన్నారు. కానీ దామిని మాత్రం మూడు వారాలకే బయటకు వచ్చింది. బిగ్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. ఏడో సీజన్‌ ప్రారంభ సమయంలో హౌస్‌లో ఏడుగురు అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు హౌల్‌లో నుంచి ముగ్గురు అమ్మాయి వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌస్‌లో నలుగురు అమ్మాయిలు(ప్రియాంక, శుభశ్రీ, రతిక, శోభా శెట్టి), ఏడుగురు అబ్బాయిలు(శివాజీ, తేజ, పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌, గౌతమ్‌ కృష్ణ, అమర్‌దీప్‌, యావర్‌) ఉన్నారు.