ఈ నెల 24న వీజే సన్నీ సౌండ్ పార్టీ

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం టీజ‌ర్, పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై టాలీవుడ్ లో గ‌ట్టిగానే సౌండ్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే సినిమాపై ప్రేక్షకుల్లో అంచ‌నాలు రేకెత్తించిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

ఈ సంద‌ర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత ర‌వి పోలిశెట్టి మాట్లాడుతూ…ఇప్ప‌టికే విడుద‌లైన మా `సౌండ్ పార్టీ` చిత్రం టీజ‌ర్ , సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. బిజినెస్ ప‌రంగా కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. టీజ‌ర్ లోని డైలాగ్స్ , వీజే స‌న్ని , శివ‌న్నారాయ‌ణ కెమిస్ట్రీ బాగా కుదిరిందంటున్నారు. ప్ర‌జంట్ ఆడియ‌న్స్ ఫ‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ చిత్రాల‌ను బాగా ఆద‌రిస్తున్నారు.. అదే త‌ర‌హాలో తెర‌కెక్కిన మా చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ నెల 24న గ్రాండ్ గా సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నాం అన్నారు.

స‌మ‌ర్ప‌కుడు జ‌య శంక‌ర్ మాట్లాడుతూ…పాట‌లు, టీజ‌ర్ సినిమాను ఇప్ప‌టికే ప‌బ్లిక్ లోకి తీసుకెళ్లాయి. సినిమా అంతా పూర్త‌యింది. ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరికి ఏ న‌మ్మ‌కంతో అయితే సినిమా ఇచ్చామో దాన్ని నిల‌బెట్టుకున్నాడు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులకు నచ్చే విధంగా ఒక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ తీశాడు. ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం అన్నారు.
ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ…“నిర్మాత‌లు ఇచ్చిన ఫ్రీడంతో స‌మ‌ర్ప‌కులు జ‌య శంక‌ర్ స‌పోర్ట్ తో సినిమాను అనుకున్న విధంగా తీయ‌గ‌లిగాను. ఇటీవ‌ల సినిమా చూసి యూనిట్ అంతా హ్యాపీగా ఫీల‌య్యాం. మా చిత్రానికి ప‌ని చేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఇచ్చిన స‌పోర్ట్ వ‌ల్లే ఒక మంచి సినిమా చేయ‌గ‌లిగా. ఇప్ప‌టికే టీజ‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నెల 24న వ‌స్తోన్న సినిమాకు కూడా అదే రెస్పాన్స్ వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.