షరతులు వర్తిస్తాయి రివ్యూ

టైటిల్‌ : షరతులు వర్తిస్తాయి
నటీనటులు: చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు
నిర్మాణ సంస్థ: స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
దర్శకత్వం: కుమారస్వామి (అక్షర)
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – ప్రిన్స్ హెన్రీ
మ్యూజిక్ – అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)
సినిమాటోగ్రఫీ – ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
ఎడిటింగ్ – సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
విడుదల తేది: మార్చి 15, 2024

కథేంటంటే..
ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన చిరంజీవి(చైతన్య రావు) నాన్న చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు భుజాన పడతాయి. ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ చెల్లి, తమ్ముడిని చదివించడానికి కష్టపడుతూ ఉంటాడు. మరోపక్క తన చిన్ననాటి స్నేహితురాలు విజయశాంతి అలియాస్‌ విజయ(భూమి శెట్టి)తో ప్రేమలో ఉంటాడు. కష్టకాలం అనుకున్నప్పుడు ఆర్థిక సహాయం చేసి అతనికి తోడుగా నిలిచే ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు. ఇక చైన్‌ మార్కెటింగ్ లో ఆ ఏరియా లీడర్‌ డబ్బు పెట్టమనడంతో చిరంజీవి డబ్బు కట్టి మరో నలుగురిని జాయిన్‌ చేయిస్తాడు. చిరంజీవికి తెలియకుండా తన భార్య, తల్లి కూడా ఈ బిజినెస్‌ కోసం డబ్బులు కట్టగా రాత్రికి రాత్రే ఆ కంపెనీ బోర్డు తిప్పేస్తుంది. అయితే ఈ క్రమంలో చిరంజీవి ఏం చేశాడు? భర్తకు తెలియకుండా డబ్బులు కట్టిన విజయశాంతి ఏం చేసింది? అసలు ఈ డబ్బు కొట్టేసింది ఎవరు? లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లషణ: ముందు నుంచి ప్రమోషన్స్‌లో యూనిట్ చెప్పినట్లుగానే షరతులు వర్తిస్తాయి మధ్యతరగతి కుటుంబాల తీరు, అత్యాశకి పోయి ఇబ్బందులు పడుతూన్న తీరు కళ్ళకు కట్టినట్టు చూపారు. నిజానికి సినిమా అంతా తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. చైన్ మార్కెట్ మోసాలు అనేవి అనునిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అలాంటిది మన కుటుంబానికే ఆ సమస్య ఎదురైతే ఏమిటి పరిస్థితి అని ఆలోచనలో పడేసేలా సినిమా ఉంది. డబ్బు ఆశ చూపించి మోసం చేసేందుకు మిడిల్ క్లాస్ వాళ్లను కంపెనీలు ఎలా టార్గెట్ చేస్తాయో సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపారు. కూడబెట్టిన డబ్బు పోగొట్టుకుని కుటుంబాలు పడే బాధను కళ్ళ ముందుకు తెచ్చారు. ఫస్టాఫ్ లో చిరంజీవి, విజయ లవ్‌ స్టోరీ, వారి కుటుంబాల పరిస్థితి, మిడిస్‌ క్లాస్‌ ఫ్యామిలీల కష్టాలని చూపి పెళ్లి తర్వాత అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవలతో కాస్త కామెడీ టచ్ ఇచ్చారు. ఇక అటు తల్లికి ఇటు భార్యకి చిరంజీవి సర్ది చెప్పుకోలేక పడే తంటాలు పెళ్ళైన ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అవుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ కాస్త ఎమోషనల్‌ అనిపిస్తూనే ఉంటూనే సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ పెంచేస్తుంది. సెకండాఫ్ లో కథ ఒక పాయింట్‌ చుట్టే తిరుగుతుంది. అయితే క్లైమాక్స్‌ రొటీన్‌ ఇంకా బాగా రాసుకోవచ్చనిపించేలా ఉంది.

నటీనముల విషయానికి వస్తే మధ్యతరగతి మధ్య వయస్కుడు చిరంజీవి అనే పాత్రలో చైతన్య రావు ఒదిగిపోయాడు. వన్ మ్యాన్ షోలాగా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. మిడిల్‌ క్లాస్‌ అమ్మాయిగా, భార్యగా భూమి శెట్టి ఆకట్టుకుంది. నంద కిషోర్, వెంకీ, పెద్దింటి అశోక్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, నేచురల్‌గా అనిపించింది. నేపథ్య సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉన్నా పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. కాస్త మలయాళ, తమిళ నాన్ కమర్షియల్ సినిమాల ఫ్లేవర్ లో సినిమా సాగింది.

ఫైనల్ గా షరతులు వర్తిస్తాయి మధ్యతరగతి కుటుంబాల కథ, రొటీన్ కమర్షియల్ హంగులు లేని సినిమా కావడంతో అందరికీ నచ్చకపోవచ్చు.టైటిల్‌ : షరతులు వర్తిస్తాయి రివ్యూ నటీనటులు: చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు నిర్మాణ సంస్థ: స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ దర్శకత్వం: కుమారస్వామి (అక్షర) బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – ప్రిన్స్ హెన్రీ మ్యూజిక్ – అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల) సినిమాటోగ్రఫీ – ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి ఎడిటింగ్ – సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్ విడుదల తేది: మార్చి 15, 2024 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అన్నపూర్ణ ఫోటో స్టూడియో, కీడా కోలా సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న ఆయన షరతులు వర్తిస్తాయి అనే సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తున్నపుడు ఈ షరతులు వర్తిస్తాయి లాంటి పదాలు వింటూ ఉంటాం. ఇక అలా ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం పదండి. కథేంటంటే.. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన చిరంజీవి(చైతన్య రావు) నాన్న చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు భుజాన పడతాయి. ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ చెల్లి, తమ్ముడిని చదివించడానికి కష్టపడుతూ ఉంటాడు. మరోపక్క తన చిన్ననాటి స్నేహితురాలు విజయశాంతి అలియాస్‌ విజయ(భూమి శెట్టి)తో ప్రేమలో ఉంటాడు. కష్టకాలం అనుకున్నప్పుడు ఆర్థిక సహాయం చేసి అతనికి తోడుగా నిలిచే ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు. ఇక చైన్‌ మార్కెటింగ్ లో ఆ ఏరియా లీడర్‌ డబ్బు పెట్టమనడంతో చిరంజీవి డబ్బు కట్టి మరో నలుగురిని జాయిన్‌ చేయిస్తాడు. చిరంజీవికి తెలియకుండా తన భార్య, తల్లి కూడా ఈ బిజినెస్‌ కోసం డబ్బులు కట్టగా రాత్రికి రాత్రే ఆ కంపెనీ బోర్డు తిప్పేస్తుంది. అయితే ఈ క్రమంలో చిరంజీవి ఏం చేశాడు? భర్తకు తెలియకుండా డబ్బులు కట్టిన విజయశాంతి ఏం చేసింది? అసలు ఈ డబ్బు కొట్టేసింది ఎవరు? లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. విశ్లషణ: ముందు నుంచి ప్రమోషన్స్‌లో యూనిట్ చెప్పినట్లుగానే షరతులు వర్తిస్తాయి మధ్యతరగతి కుటుంబాల తీరు, అత్యాశకి పోయి ఇబ్బందులు పడుతూన్న తీరు కళ్ళకు కట్టినట్టు చూపారు. నిజానికి సినిమా అంతా తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. చైన్ మార్కెట్ మోసాలు అనేవి అనునిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అలాంటిది మన కుటుంబానికే ఆ సమస్య ఎదురైతే ఏమిటి పరిస్థితి అని ఆలోచనలో పడేసేలా సినిమా ఉంది. డబ్బు ఆశ చూపించి మోసం చేసేందుకు మిడిల్ క్లాస్ వాళ్లను కంపెనీలు ఎలా టార్గెట్ చేస్తాయో సినిమాలో కళ్ళకి కట్టినట్టు చూపారు. కూడబెట్టిన డబ్బు పోగొట్టుకుని కుటుంబాలు పడే బాధను కళ్ళ ముందుకు తెచ్చారు. ఫస్టాఫ్ లో చిరంజీవి, విజయ లవ్‌ స్టోరీ, వారి కుటుంబాల పరిస్థితి, మిడిస్‌ క్లాస్‌ ఫ్యామిలీల కష్టాలని చూపి పెళ్లి తర్వాత అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవలతో కాస్త కామెడీ టచ్ ఇచ్చారు. ఇక అటు తల్లికి ఇటు భార్యకి చిరంజీవి సర్ది చెప్పుకోలేక పడే తంటాలు పెళ్ళైన ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అవుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ కాస్త ఎమోషనల్‌ అనిపిస్తూనే ఉంటూనే సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ పెంచేస్తుంది. సెకండాఫ్ లో కథ ఒక పాయింట్‌ చుట్టే తిరుగుతుంది. అయితే క్లైమాక్స్‌ రొటీన్‌ ఇంకా బాగా రాసుకోవచ్చనిపించేలా ఉంది. నటీనముల విషయానికి వస్తే మధ్యతరగతి మధ్య వయస్కుడు చిరంజీవి అనే పాత్రలో చైతన్య రావు ఒదిగిపోయాడు. వన్ మ్యాన్ షోలాగా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. మిడిల్‌ క్లాస్‌ అమ్మాయిగా, భార్యగా భూమి శెట్టి ఆకట్టుకుంది. నంద కిషోర్, వెంకీ, పెద్దింటి అశోక్ కుమార్‌తో పాటు మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, నేచురల్‌గా అనిపించింది. నేపథ్య సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉన్నా పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

రేటింగ్ 3/5