పెదకాపు 1 మూవీ రివ్యూ

శ్రీకాంత్‌ అడ్డాల సినిమా అనగానే అందరికి ఫ్యామిలీ సినిమాలు గుర్తొస్తాయి. నారప్ప మినహా ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు సంబంధించినవే. అలాంటి డైరెక్టర్‌ పెదకాపు అంటూ ఏ సర్టిఫికేట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్‌, ట్రైలర్‌కు భారీ మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెదకాపు 1 చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.
కథ విషయానికొస్తే.. అది 1982. అప్పుడే టీడీపీ పార్టీ పుట్టింది. రాష్ట్రంలో యువత ఆ పార్టీకి పని చేయడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తోంది. గోదావ‌రి జిల్లాల్లోని లంక గ్రామంలోనూ అదే ప‌రిస్థితి.అక్క‌డ స‌త్య రంగ‌య్య (రావు ర‌మేష్‌), బ‌య‌న్న(న‌రేన్) అనే ఇద్దరి వ‌ర్గాలు ఉంటాయి. ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ వాళ్ల మ‌ధ్యే పోటీ.వీరిద్ద‌రి మ‌ధ్యా స‌యోధ్య కుదిర్చి.. వీళ్ల‌లో ఒక‌రికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వ‌డానికి ఆ పార్టీ ఇన్‌ఛార్జ్ (నాగ‌బాబు) శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తుంటాడు. స‌త్య రంగ‌య్య కోసం పెద‌కాపు (విరాట్ క‌ర్ణ‌) త‌న అన్న‌తో క‌లిసి ప‌నిచేస్తుంటాడు. త‌న‌ని అవ‌మానించాడ‌న్న కోపంతో బ‌య్య‌న్న కొడుకుని దారుణంగా చంపేస్తాడు స‌త్య రంగ‌య్య‌. అయితే ఆ నేరాన్ని త‌న మీద వేసుకొని జైలు పాల‌వుతాడు పెదకాపు అన్న‌య్య‌. అయితే జైలుకెళ్లిన అన్న‌య్య క‌నిపించ‌క‌పోయేస‌రికి స‌త్య రంగ‌య్య‌పైనా, బ‌య‌న్న‌పైనా ఎదురు తిరుగుతాడు పెదకాపు. ఆ త‌ర్వాత ఏమైంది? ఓ సామాన్యుడి తిరుగుబాటు ఏ రూపాన్ని సంత‌రించుకొంది? అదే ఊర్లో ఉన్న అక్క‌మ్మ (అన‌సూయ‌) క‌థేమిటి? అనేదే మిగతా కథ.
విశ్లేషణ
ఓ సామాన్యుడి పోరాటమే ఈ సినిమా కథ.
ఆత్మ గౌరవం కోసం ఓ సామాన్యుడు నాయకుడిగా ఎలా ఎదిగాడనేది ఈ సినిమాలో చూపించారు. చీకటి నుంచి వెలుగులోకి రావాలంటే యుద్దం చేయాల్సిందేనా అనే విషయాన్ని ఈ సినిమాలో చర్చించాడు దర్శకుడు. ఓ చిన్న పాప ఎపిసోడ్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ రాజకీయం వైపు మర్లుతుంది.ర్లోని రాజ‌కీయం ఎలా ఉంది? ఎవ‌రి ఆధిప‌త్యం ఎంత‌? మేక‌వ‌న్నె పులులెవ‌రు? ఈ క‌థ‌కు సూత్ర‌ధారులెవ‌రు? అనే విష‌యాన్ని ఒకొక్క‌టిగా వివ‌రించుకొంటూ వెళ్లాడు డైరెక్టర్‌. ఈ సినిమాలో చాలా పాత్ర‌లున్నాయి. చాలా సంఘ‌ర్ష‌ణ‌లున్నాయి.ఏ పాత్ర‌ని ఫాలో అవ్వాలి? ఎవ‌రి ఎమోష‌న్‌కి ద‌గ్గ‌ర అవ్వాలి? అనే విష‌యంలో ప్రేక్ష‌కుడు అయోమయోనాకి గురవుతాడు. ప్ర‌తీ పాత్ర‌నీ విడ‌మ‌ర్చి చెప్పే ప్ర‌య‌త్నంలో కథ సాగదీశాడు. తెరపై జరుగుతున్న సంఘర్షనకు ప్రేక్షకుడు కనెక్ట్‌ కాడు. ఇంటర్వెల్‌ సీన్‌ ఒకటి ఊహించనవి విధంగా. అలాగే అనయసూయ పాత్ర ఎంట్రీ తర్వాత కథ ఆసక్తికరంగా సాగుతుంది.కొన్ని చోట్ల నారప్ప, రంగస్థలం సినిమాల ఛాయలు కనిపిస్తాయి. ఓవరాల్‌గా పెదకాపు సినిమాలు యావరేజ్‌ అనే చెప్పాలి.
నటీనటులు
ఈ సినిమాలో హీరోగా నటించిన విరాట్‌ కర్ణకి ఇది తొలి సినిమా. అయినా ఆ విషయం తెరపై కనిపించకుండా మ్యానేజ్‌ చేశాడు. హీరోయిన్‌ ప్రగతి శ్రీవాస్తవ తెరపై అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. అక్కమ్మ పాత్రలో అనసూయ ఒదిగిపోయింది. సతయరంగయ్యగా రావురమేశ్‌ ఫెర్ఫార్మెన్‌ నెక్ట్‌ లెవల్‌.విలన్‌గా బాగా ఆకట్టుకున్నాడు. విలన్‌ కన్నబాబుగా శ్రీకాంత్‌ అడ్డాల అదరగొట్టాడు. నాగబాబు, ఈశ్వరీ బాయి, తనికెళ్ల భరణితో పాటు ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్‌ పరంగా ఈసినిమా చాలా బాగుంది. చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది. గోదావరి నేపథ్యాన్ని తెరపై చాలా అందంగా చూపించాడు. మిక్కి జేమేయర్‌ బీజీఎం బాగుంది. ప్రొడక్షన్స్‌ వ్యాల్యూస్‌ బాగున్నాయి.
Rating: 1.5