బిగ్‌బాస్‌ 7: ఒక్కో ఎపిసోడ్‌కి నాగార్జున ఎంత తీసుకుంటాడో తెలుసా?

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఆదరణ ఇప్పటికీ తగ్గలేదు. ఏడు సీజన్లుగా బిగ్‌బాస్‌ని బుల్లితెర ప్రేక్షలులు ఆదరిస్తూనే ఉన్నారు. ప్రతి సీజన్‌లో వైవిధ్యం ఉండేలా నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు. కంటెస్టెంట్ల ఎంపిక మొదలు షో వరకు ప్రతీ విషయంలో డిఫరెంట్‌ ఉండేలా చూసుకుంటున్నారు. ఏడో సీజన్‌ని చాలా రసవత్తరంగా నడిపిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే తన హోస్టింగ్‌తో బిగ్‌బాస్‌ షోను ముందుకు తీసుకెళుతున్నాడు అక్కినేని నాగార్జున.

3వ సీజన్‌ నుంచి ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున వల్లే బిగ్‌బాస్‌ షోకి తెలుగులో క్రేజ్‌ వచ్చిందనడంలో సందేహం లేదు. అయితే షో నిర్వాహకులు సైతం అది గుర్తించి అత్యధిక పారితోషికం ఇచ్చి మరీ నాగార్జుననే హోస్ట్‌గా రన్‌ చేస్తున్నారు. ఏడో సీజన్‌కి నాగ్‌కి భారీ రెమ్యునరేషన్స్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. కోటి అందించినట్లు నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

సాధారణంగా బిగ్‌బాస్‌ ప్రతి సీజన్‌ మూడు నెలలు నడుస్తుంది. అంటే దాదాపు 12 వారాలు. ప్రతి వీకెండ్‌లో నాగార్జున షోకు వస్తుంటారు. అలా శని, ఆదివారాలన్నీ కలిసి సీజన్‌ మొత్తం మీద 20 కోట్ల రూపాయలకు పైగానే పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నాగార్జున రేంజ్‌ అంటే ఆ మాత్రం ఉండాలి కదా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. అయితే మొత్తం ముగ్గురు కంటెస్టెంట్లు బయటకు వచ్చారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్‌, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్‌ దామినీ ఎలిమినేట్‌ అయ్యారు. ఇక నాలుగో వారం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్‌ లిస్ట్‌లోకి వచ్చారు. రతికా రోజ్, టేస్టీ తేజా, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ ఈ లిస్టులో ఉన్నారు.